ఛత్తీస్ ఘడ్ లోని బీజాపూర్-సుకుమా జిల్లాల సరిహద్దుల్లో శనివారం జరిగిన ఎన్కౌంటర్ లో 21 మంది జవానులు జాడ తెలియట్లేదని పోలీసులు తెలిపారు,కానరాని జవానులు జాడకోసం ఒక బృందం గాలిస్తున్నట్లు తెలుస్తోంది.బీజాపూర్ జిల్లా లోని టర్రేం అడవుల్లో శనివారం జరిగిన మావోయిస్టులు, జవానులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్ లో 8 మంది భద్రతా సిబ్బంది మరణించగా,ఇద్దరు మావోయిస్టులు మరణించగా, 31 మంది జవానులకు తీవ్ర గాయాలు అయ్యాయి.వీరిలో 24మందిని బీజాపూర్ ఆస్పత్రిలో చేర్పించగా,7 గురిని రాయ్ పూర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బీజాపూర్-సుకుమా సరిహద్దుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారు అన్న సమాచారం తో కోబ్రా,సీఆర్పీఎఫ్, స్పెషల్ పోర్స్ సంయుక్తంగా 2000 మంది భద్రతా సిబ్బంది కలసి నిర్వహించిన నక్సల్ ఏరివేత ఆపరేషన్ లో ఈ ఎదురుకాల్పులు జరగగా జవానులకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.