ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో అల్లు అర్జున్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మకం గా నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్ప నుండి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు.సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ లో రష్మీక కథానాయికగా నటిస్తుండగా దేవిశ్రీ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ కి సంబందించిన ప్రీ ల్యుడ్ పేరుతో గ్లిమ్స్ వీడియో విడుదల చేయగా ఏప్రిల్ 7 న అల్లుఅర్జున్ పాత్రకు సంబందించిన ఫస్ట్ లుక్ టీజర్ రానున్నదని అప్డేట్ ఇచ్చిన ఈ వీడియోలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోగా అల్లు అర్జున్ అడవిలో పరుగెత్తుతున్న దృశ్యాలు బంధించారు.