దేశంలో రోజు రోజుకు కరోనా సెకండ్ వేవ్ కొత్త రికార్డులు సృష్టిస్తూ గత మూడు రోజులుగా లక్షకు పైగా పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో వెలువడుతుండగా కరోనా కేసులు ఏక్కువ ఉన్న రాష్టాల్లో కరోనా నియంత్రణ కి కఠిన నిబంధనల అమలుకు సిద్ధం అవుతున్నాయి,దేశంలోని కేసుల్లో 60 వేల పైచిలుకు కేసులతో మొదటిస్థానం లో ఉన్న మహారాష్ట్ర లో కొన్ని పట్టణాల్లో సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించగ,రాష్ట్రం మొత్తం వీకెండ్ లాక్ డౌన్ ప్రకటించింది.మహారాష్ట్ర వ్యాప్తంగా శనివారం నుండి,సోమవారం ఉదయం వరకు కఠిన లాక్ డౌన్ ఆంక్షలు విధించనుండగా సోమవారం నుండి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ యధావిధిగా కార్యకలాపాలు కొనసాగించవచ్చు.ఇప్పుడు ఇదే బాటలో మధ్యప్రదేశ్ కూడా చేరింది.మధ్యప్రదేశ్ లోని చింద్వారా పట్టణంలో వారం రోజులపాటు పూర్తిస్థాయి లాక్ డౌన్ ప్రకటించగా,షాజాపూర్ లో రెండు రోజుల లాక్ డౌన్ విధించగా,రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఆదివారం సంపూర్ణ లాక్ డౌన్ విధించింది మధ్యప్రదేశ్ రాష్ట్రము, ఇక పంజాబ్ లో ఏప్రిల్ 30 వరకు ఎలాంటి రాజకీయ పార్టీల సమావేశాలకు అనుమతి నిలిపివేసింది.పంజాబ్ లోని 12 జిల్లాల్లో రాత్రి 9 నుండి ఉదయం 5 వరకు రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నాం అని సీఎం అమరీంధర్ సింగ్ ప్రకటించారు.