
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఈనెల 9 నుండి 21 వరకు ఇంటి నుండి బయటకు రాకుండా చూడాలని డీజీపీ కి జారీ చేసిన ఆదేశాలపై ఏపీ ప్రభుత్వం హైకోర్టులో హౌజ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది.ఎన్నికల కమిషనర్ పంచాయతీ ఎన్నికలలో ఏకగ్రీవం అయిన పంచాయితీలు ఆమోదించకపోవడంతో ఫైర్ అవడం తో పాటు ఎస్ఈసీ ఆదేశాల ప్రకారం ఏకగ్రీవాలను ఆమోదించని అధికారులను బ్లాక్ లిస్ట్ లో పెడతామని హెచ్చరించడంతో సీరియస్ అయిన కమీషనర్ మంత్రి పెద్దారెడ్డి ని మీడియా ముందుకు సైతం రానివ్వొద్దని ఆదేశించిన సంగతి తెలిసిందే.