ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా గతంలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వగా చాలా చోట్ల ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.ఈ ఏకగ్రీవాలు బలవంతంగా జరిగాయని,వాటిని ఆమోదించకూడదని ఆదేశించిన ఏపీ సీఈసీ నిమ్మగడ్డ రమేష్ పై హైకోర్టు కు వెళ్లిన వైసీపీ నేతలకు భారీ ఊరట లభించింది.వైసీపీ నేతలు వేసిన పిటీషన్ ని విచారించిన హైకోర్టు గతంలో జరిగిన ఏకగ్రీవాలపై విచారణకి ఎన్నికల కమిషన్ కి అధికారం లేదని అప్పటి ఏకగ్రీవాలను వెంటనే ఆమోదించాలని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ని ఆదేశించింది హైకోర్టు ధర్మాసనం.