ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి అధికంగా ఉండటంతో భారత్ నుండి వచ్చే ప్రయాణికులపై న్యూజిలాండ్ బ్యాన్ విధించింది. ఏప్రిల్ 11 నుండి 28 వరకు భారత్ నుండి వచ్చే ప్రయాణికులపై,భారత్ నుండి వచ్చే తమ దేశీయులపైన తాత్కాలికంగా నిషేధం విదిస్తున్నామని ఆదేశ ప్రధాని జసిందా ఆర్డెన్ ప్రకటించారు.తాజా కరోనా బులిటెన్ ప్రకారం నిన్న దేశంలోనే ఒక్కరోజులో 126789 కరోనా పాజిటివ్ కేసులు వెలువడగా ప్రస్తుతం అత్యధిక కేసులు నమోదవుతున్న దేశాల్లో భారత్ తొలి స్థానం లో ఉండగా,నిన్న ఒక్కరోజే కరోనాతో దేశవ్యాప్తంగా 685 మంది మరణించారు.