తెలంగాణ వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి ఈరోజు బండి సంజయ్ తో భేటీ అయ్యారు. రెండు రోజుల క్రితం వైసీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన శ్రీకాంత్ రెడ్డి ఓ జాతీయ పార్టీలో చేరుతానని చెప్పడం ఈరోజు భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో శ్రీకాంత్ రెడ్డి బీజేపీ లో జాయిన్ అయ్యే అంశంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీ పటిష్టత పై కూడా చర్చించినట్టు సమాచారం. గతంలో 2014 ఎన్నికల్లో హుజూర్ నగర్ నుండి వైసీపీ పార్టీ తరుపున పోటీ చేసి 29000 వేల ఓట్లు సాధించిన శ్రీకాంత్ రెడ్డి ,ఆ తరువాత ఎన్నికల్లో వైసీపీ తెలంగాణ లో పోటీ చేయకపోవడంతో తను సైతం పోటీ నుంచి విరమించుకున్న శ్రీకాంత్ రెడ్డి,గత హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన శ్రీకాంత్ రెడ్డి కేసీఆర్ గారు,జగన్ గారి స్నేహం దృష్ట్యా పోటీ నుంచి విరమించుకున్న శ్రీకాంత్ రెడ్డి,జగన్ గారికి తెలంగాణ లో వైసీపీ పార్టీని విస్తరించే ఆలోచన లేకపోవడంతో పార్టీకి రాజీనామా చేసి బీజేపీ లో చేరాలని నిర్ణయించుకున్న శ్రీకాంత్ రెడ్డి దానికి అనుగుణంగా నే ఈరోజు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గారితో భేటీ అయ్యారు.
వైసీపీ నుండి బీజేపీ లో చేరడం ఖాయం అయిన నేపథ్యంలో తన భవిష్యత్ కార్యాచరణపై పార్టీ పెద్దల నుండి స్పష్టమైన హామీ వచ్చినట్టు తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో హుజూర్ నగర్ నుండి పోటీ తో పాటు,రాష్ట్ర పార్టీ కార్యవర్గంలోకి శ్రీకాంత్ రెడ్డిని తీసుకోనున్నట్లు తెలుస్తోంది.