తెలంగాణ బీజేపీ అధికార టీఆర్ఎస్ దూకుడు మీదున్న కాంగ్రెస్ ని ఏమార్చి అదిరిపోయే అడుగేసింది.ఒక్కరోజు ముందువరకు అభ్యర్థి ఎవరనే దానిపై దోబూచులాడిన టిఆర్ఎస్ బీజేపీ తమ వ్యూహాలకు అనుగుణంగా అడుగేస్తూ కాలయాపన చేస్తుండగా,అధికార టిఆర్ఎస్ పార్టీని ఓ అడుగు ముందుకు వేసేలా తమ అభ్యర్థి నివేదిత అని మధ్యాహ్నం లీకులు ఇచ్చి తదనుగుణంగా టిఆర్ఏఎస్ పార్టీ తమ అభ్యర్థి గా నోముల భగత్ పేరును ప్రకటించి బీ ఫామ్ ఇచ్చాక,రాత్రి నాగార్జున సాగర్ ఉపఎన్నిక బీజేపీ అభ్యర్థి గా రవి నాయక్ పేరును ప్రకటించింది. మూడు ప్రధాన పార్టీలు మూడు సామాజికవర్గాలకు చెందిన అభ్యర్థులను ప్రకటించి అసలైన ఆటకు తెరతీసాయి,నాగార్జున సాగర్ లో కీలకంగా ఉండే యాదవ, ఎస్టీ సామాజిక వర్గ ఓట్లకు టిఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులు పోటీలో ఉండగా,కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీనియర్ నేత రెడ్డి సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.జనరల్ స్థానాన్ని గతంలో బీసీ లకు ఇచ్చామని టిఆర్ఎస్ గెలుపు తీరం చేరగా ,ఇప్పుడు ఏకంగా ఎస్టీ అభ్యర్థి అయిన స్థానికంగా మంచి పేరున్న వైద్యుడు రవి నాయక్ పేరు ప్రకటించి కీలక ఓటు బ్యాంక్ అయిన ఎస్టీ లను తమవైపు తిప్పుకోవాలని కీలక నిర్ణయం తీసుకుంది.