హైదరాబాద్ నుండి అరకు యాత్రకు వెళ్లిన ఓ బస్సు లోయలోకి దూసుకెళ్లిన ఘటనలో 8 మంది మృతి చెందగా 10 మందికి పైగా గాయపడినట్టు తెలుస్తుంది.హైదరాబాద్ కి చెందిన దినేష్ ట్రావెల్స్ బస్సు అరకు లోయ సమీపంలోని 5 వ నంబర్ మలుపు వద్ద అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది,ప్రమాదానికి గురైన బస్సులో 24 మంది ఉన్నట్లు తెలుస్తుంది,వీరంతా హైదరాబాద్ కి చెందిన వారిని పేర్కొన్న రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్న పోలీసులు క్షతగాత్రులను ఎస్ కోట ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.