జమ్మూకాశ్మీర్ లో ఈరోజు తెల్లవారుజామున భూమి స్వల్పంగా కంపించడంతో నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడి భయంతో బయటకి పరుగులు తీశారు.తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో స్వల్ప ప్రకంపనలు రాగా విషయం తెలుసుకున్న అధికారులు ,నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారులు రిక్టర్ స్కెల్ పై భూకంప తీవ్రతను పరిశీలించి,భూకంప తీవ్రత 3.5 గా నమోదైనట్లు వెల్లడించారు.గత కొద్ది రోజులుగా స్వల్పంగా భూప్రకంపనలు ఉండటంతో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెప్పారు.