తెలంగాణ రాజకీయల్లో ప్రస్తుతం ఈటెల రాజేందర్ మాట స్వపక్షం లో ప్రతిపక్షంలా మారింది.ప్రతిపక్షాల మాటల కన్నా ఈటెల మాటలు తూటాల్లా పేలుతు ప్రభుత్వం పైకి,అధికార పార్టీ వైపే దూసుకొస్తున్నాయి.అప్పట్లొ పార్టీ జెండా ఓనర్లమ్ అంటూ పార్టీ వైపు ఆస్త్రాలు ఎక్కుపెట్టగ,ఈ మధ్య రైతు ఐక్య వేడిక ప్రారంభోత్సవంలో ‘కల్యాణ లక్ష్మీ,రైతు బంధు లాంటి సంక్షేమ పథకాలు పరిగె లాంటివి,వీటితో పేదరికాన్ని రూపుమాపలేం, పెరిగె ఏరుకుంటే పంట పండి నట్టు కాదుకదా’ అంటూ ఏకంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల పై మాటల తూటాలను పేల్చి పార్టీ అధినేత ఆలోచనాలపైకె తూటాలు దూసుకెళ్లేట్లు చేసిన ఈటెల, పార్టీ జెండా కాదు మనషులను గుర్తుంచుకోండి అంటూ పార్టీ వేరు,వ్యక్తులు వేరు అంటూ మరో సంచలన తూటా పేల్చిన ఈటెల మాటలకు స్వయంగా ముఖ్యమంత్రి వెంటనే పిలిపించి స్వయంగా కేటీఆర్ తన వాహనంలో ఈటెలను ఎక్కించుకుని మరీ వెళ్లి ప్రగతి భవన్ లో కేసీఆర్ తో సమావేశం అయ్యారు.సమావేశం ముగిసింది అంతా సర్దుకుంటుంది, మాటల ఈటెల వేడి చల్లారుతుంది అనుకుంటున్న వేళ నిన్న హైదరాబాద్ లో బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన దొడ్డి కొమురయ్య 94 వ జయంతి ఉత్సవాలకు హాజరైన సందర్భంగా ఈటెల మాట్లాడుతూ ‘భారత రాజ్యాంగం కలిపించిన ఓటుహక్కు ఆయుధం వంటిదని, అలాంటి ఓటుహక్కును నోటుతో కొనడం సరైంది కాదు అని’ మరోమారు మాటల తూటాలను పేల్చి ఎక్కడ తగలాలో అక్కడికే గురిపెట్టినట్లు తెలుస్తుంది.పార్టీలో తనను దూరంబుపెట్టినట్టు భావిస్తున్న ఈటెల,తనను వేరు చేస్తున్నట్టు చూస్తున్న పార్టీకి, పార్టీ అధినేతకు ఈటెల సందించే మాటల బాణాలు మాత్రం ప్రజా క్షేత్రం నుండి దూసుకెళ్తూ స్వపక్షం లో విపక్షంలా మారుతున్నాయు. అసలు ఈటెల మర్మం ఏంటో?? ఈటెల మాటల తీవ్రత,చేతల నడవడిక దృష్ట్యా అసలు ఆయన దారెటొ? తన ప్రస్తుత ప్రయాణం ఎక్కడ ముగించి ఏ వైపుకు మరలుతాడో రాజకీయ విశ్లేషకులకు సైతం అంతుచిక్కట్లేదు.