అసెంబ్లీ కాలవ్యవది ముగియనున్న అయిదు రాష్టాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల అధికారి సునీల్ అరోరా షెడ్యూల్డ్ విడుదల చేసారు.ఈ షెడ్యూల్డ్ ప్రకారం తమిళనాడు,కేరళ, పుదుచ్చేరిలో ఒకే విడతలో ఏప్రిల్ 6 న,అస్సాం లో మూడు విడుతలలో march 27 తొలివిడత,ఏప్రిల్ 1 రెండవ విడత,ఏప్రిల్ 6 మూడవ విడత, పశ్చిమ బెంగాల్ లో ఎనిమిది దశలలో march 27,ఏప్రిల్ 1,6,10,17,22,26,29 లలో ఎన్నికలు జరగనున్నాయి అని తెలిపింది.ఇక కన్యాకుమారి పార్లమెంట్ స్థానానికి ఏప్రిల్ 6 న జరగనుండగా,మే 2 న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.కరోనా ఉధృతి ఉన్న దృష్ట్యా ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు సహకరించాలని, కోవిడ్ ఉధృతి కారణంగా ఒక గంట పాటు పోలింగ్ ఎక్కువ సేపు జరగనుండగా,చివరి గంటలో కరోనా బాధితులకు ఓటింగ్ అవకాశం ఇవ్వనుండిగా,80 ఏళ్లు దాటినా వృద్ధులకు ఈ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే సదుపాయం కలిపించనున్నారు.