తెలంగాణ వైసీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి ఈరోజు వైసీపీ కి రాజీనామా చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ‘ఒక సామాన్య కార్యకర్తను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు,జగన్ గారికి వైసీపీ ని తెలంగాణ లో విస్తరించే ఆలోచన ఇప్పట్లో లేనందున ఆ పార్టీ అధ్యక్ష పదవికి,పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్న,జగన్ మరెంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అని అన్న శ్రీకాంత్ రెడ్డి పార్టీని వీడటం బాధగా ఉందన్నారు. త్వరలోనే ఓ జాతీయ పార్టీలో చేరుతానని ప్రకటించిిిిన శ్రీకాంత్ రెడ్డి చేరేది బీజేపీ లోనే అని తెలుస్తుంది.గతంలో శ్రీకాంత్ రెడ్డి 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున హుజూర్ నగర్ నుండి పోటీ చేసి 29000 ఓట్లు సాధించడం విశేషం.మళ్లీ హుజూర్ నగర్ నుండే పోటీకి దిగుతా అని ప్రకటించిన శ్రీకాంత్ రెడ్డి బీజేపీ పార్టీ అధ్యక్షుడు తో టచ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. శ్రీకాంత్ రెడ్డి అయితేనే హుజూర్ నగర్ నియోజకవర్గంలో బీజేపీ ఇతర పార్టీలకు గట్టి పోటీ ఇవ్వడమే కాదు గెలుపు అవకాశం ఎక్కువతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గంలో బీజేపీ కి గట్టి పట్టు దొరుకుతుంది అని భావిస్తున్నారు