డీగ్లామర్ పాత్రలో ఊరమాస్ లుక్ తో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో అల్లుఅర్జున్ నటిస్తున్న సుకుమార్ డైరెక్షన్ లో,మైత్రి మూవీ మేకర్స్ పతాకం పై వస్తున్న బహుబాష చిత్రం పుష్ప.గత కొన్ని రోజులుగా మారేడు పల్లి అడవులు,కేరళలోని అడవుల్లో షూటింగ్ సందడి చేసిన టీమ్ ఈ చిత్రాన్ని ఆగస్ట్ 13 న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు, ఇందుకు అనుగుణంగా ఈరోజు నుండి బన్నీ డబ్బింగ్ పనులు కూడా మొదలెట్టినట్టు సమాచారం.అల్లు అర్జున్ జన్మదిన సందర్భంగా అల్లు అర్జున్ పాత్ర పరిచయ వీడియో ఒక్కరోజు ముందుగానే వదిలారు.ఇప్పటికే వదిలిన అల్లు అర్జున్ గ్లిమ్స్ వీడియో చిత్రంపై ఆసక్తిని పెంచుతుండగా,