*ప్రజలతో ముఖాముఖి రచ్చబండ*
•••••••••••••••••••••••••••••••••••••••••••••
త్వరలోనే వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల పర్యటనకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ మంచి విజయం సాధించడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాస్త హుషారుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన జిల్లాల పర్యటనకు వెళ్లడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. గతంలో తన తండ్రి నిర్వహించిన *రచ్చబండ* మాదిరిగానే ఆయన ప్రజలతో మమేకం అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.ఇప్పటికే పార్టీ కీలక నేతలతో చర్చించిన జగన్ ఉగాది అన్నతరం దీనికి సంబంధించి త్వరలోనే ఒక షెడ్యూల్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది.
మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించటం తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా పార్టీ విజయం సాధించే అవకాశాలు కనబడటంతో జగన్ కాస్త జోష్ మీద ఉన్నారు అని తెలుస్తుంది. అందుకే ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాల విషయంలో కాస్త దృష్టి పెడితే కచ్చితంగా ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంటుందని సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన అభిప్రాయాలను ప్రజల వద్ద నుంచి తెలుసుకుని వారికి పూర్తిస్థాయిలో అందే విధంగా చర్యలు చేపడితే పార్టీకి మంచి ప్రయోజనం ఉంటుందని జగనన్న భావిస్తున్నారు. ఇక మంత్రులు పనితీరు ఎమ్మెల్యేల పనితీరు అధికారుల పనితీరు పై కూడా ఈ పర్యటనలో ముఖ్యమంత్రివర్యులు జగన్ గారు నేరుగా తెలుసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. తిరుపతి ఉప ఎన్నికల తర్వాత జగనన్న ప్రజల్లోకి వెళ్లి అవకాశం ఉండొచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సంక్షేమ కార్యక్రమాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు సీరియస్ గానే ముందుకు వెళ్తున్నది. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసే విషయంలో కొన్ని లోపాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొంతమంది ముఖ్యమంత్రివర్యులు జగన్ కు సహకరించడం లేదు అని ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి.
ప్రతిపక్షాలు, గత పాలకుల కుట్ర చాలా ఎక్కువగా కనిపిస్తుంది.
దీనితో ముఖ్యమంత్రి వర్యులు జగన్ వారి విషయంలో కఠినంగా ముందుకు వెళ్లవచ్చు అని ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి వర్యులు జగనన్న కొన్ని కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నట్టుగా సమాచారం.