తాడిపత్రి మున్సిపల్ పరిధిలోని 35వ వార్డులో తన అనుచరులతో కలిసి పర్యటించిన జేసీ ప్రభాకర్ రెడ్డి,అక్కడి కాలనీ వాసులు డ్రైనేజీ ,రోడ్లు బాగాలేవని మొరపెట్టుకోగా, జేసీ వారిపై కోపంతో ఊగిపోతూ, మీకు పని ఎందుకు చేసిపట్టాలి??ఎన్నికలప్పుడు 2000 తీసుకుని ఓటు వేశారు,ఇక మీకు సమస్యలపై నిలదీసే హక్కు ఎక్కడిది?? నిజాయితీగా ఓటు వేసి ఉంటే నా గల్లా పట్టి అడిగే అవకాశం ఉండేది,కానీ నోటుకు ఓటేస్తే నిలదీసే హక్కు ఎక్కడిది అంటూ ఫైర్ అయ్యారు.జేసీ బ్రదర్స్ మాట్లాడే విధానం కరుకేమో కానీ మాట్లాడిన మాటల్లో ఉన్నదిఉన్నట్టు మాట్లాడుతుంటారు.