నెత్తిన తలపాగా చుట్టి,చేతిలో కర్రపట్టి టర్ టర్ అంటూ గొర్లను అటు ఇటు మలుపుతూ,సరదాగా కాసేపు గొర్లను కాస్తూ గొర్ల కాపరిగా మారిన ఎమ్మెల్యే మురిపాన్ని చూసి రోడ్డున పోయే వారు ముక్కున వేలేసుకున్నారు. వివరాల్లోకి వెళితే ఆంద్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తాడికొండ మండలం దామరపల్లి గ్రామంలో ఓ కార్యక్రమానికి హాజరై వస్తున్న సమయంలో రహదారిపై భారీగా గొర్ల మంద కనపడటంతో కాసేపు వాహనం ఎమ్మెల్యే అన్న విషయం మరచి నెత్తికి తలపాగా చుట్టి,చేతిన కర్రను పట్టి గొర్లను కాస్తూ,ఫోటోలు దుగుతూ సరదాగా గడిపింది.