దేశవ్యాప్తంగా రోజురోజుకు కరోనా ఉధృతి పెరుగుతుండటంతో మోదీ కీలక సమావేశం నిర్వహించనున్నారు.గత సంవత్సరం సెప్టెంబర్,అక్టోబర్ నెలలో కరోనా పాజిటివ్ కేసులు గరిష్టంగా నమోదవగా ప్రస్తుతం అంతకు మించి కేసులు నమోదవుతున్నాయి,నిన్న గరిష్టంగా ఒకేరోజు లక్ష కేసులు నమోదవటంతో కరోనా సెకండ్ వేవ్ దృష్ట్యా కరోనా కట్టడికి తీసుకోవలసిన చర్యలపై రాష్టాలు,కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో,అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో కీలక భేటీ కానున్నారు. కరోనా కట్టడికి తీసుకోవలసిన చర్యలు, కరోనా వ్యాక్సిన్ వేగవంతం,ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియపై సలహాలతో పాటు,లాక్ డౌన్ పై కూడా సలహాలు స్వీకరించనున్నట్టు కీలక అధికారుల సమాచారం.