J
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా నీలం సాహ్ని ని ఎంపికకు గవర్నర్ హరిచందన్ ఆమోద ముద్ర వేశారు.సాహ్నితో సహా ముగ్గురు సభ్యుల జాబితాను పరిశీలించిన గవర్నర్ సాహ్ని ని నియమిస్తూ ఉత్తరువులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ నెల 30 న పదవీ విరమణ చేయనుండగా వచ్చే నెల మొదటి వారంలోనే నీలం సాహ్ని ప్రమాణస్వీకారం చేయనున్నారు.గతంలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా పదవీవిరమణ చేసిన తక్కువ సమయంలోనే ప్రభుత్వం లో కీలక పదవిలో నియామకం అవబోతున్నారు.