ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థుల కోసం ఒడిస్సా ప్రభుత్వం సంచలన తీర్మానం చేసింది.ప్రస్తుతం ఒడిశా అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వారికి ప్రభుత్వ ఉన్నతా విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్, మెడికల్ లాంటి వాటిల్లో ప్రవేశానికి 15 % రిజర్వేషన్ కలిపిస్తూ ఈ తీర్మానం చేసింది.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ ‘ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద,మధ్యతరగతి విద్యార్థులు టాలెంట్ ఉన్న ఆర్ధిక స్థోమత లేక కోచింగ్ సెంటర్లకు డబ్బులు చెల్లించలేక ర్యాంకుల వేటలో వెనుకబడి ప్రభుత్వ పాఠశాలలో చదివిన టాలెంటెడ్ విద్యార్తిని,విద్యార్థుల కు న్యాయం జరిగేలా ఈ తీర్మానాన్ని చేస్తున్నామని పేర్కొంది.ఇందులో భాగంగా గతంలో ఓ కమిటీ అధ్యయనాన్ని ఉటంకిస్తూ ఒరిస్సా లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీటు పొందుతున్న వారు 23%, ఇంజనీరింగ్ కలాశాలలో సీటు పొందుతున్న వారు 21% మాత్రమే అదే 12 శాతం ప్రయివేట్ పాఠశాలల్లో చదివిన వారు మాత్రం దాదాపు 60% మంది ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల్లో సీట్లు సాధించారని,ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారు టాలెంట్ లేక కాదని వారు ఆర్థిక స్తోమత లేక కోచింగ్ సెంటర్ లలో చేరలేక వెనుకబడి జేఈఈ, నీట్ లాంటి వాటిల్లో ర్యాంక్ లు సాదించలేకపోతున్నారని,ఈ పరిస్థితి మారాలని ఈ తీర్మాణమని పేర్కొన్నారు.ఇలాంటి తీర్మాణాలతో మధ్య,పేద తరగతి వారు వారి ఆర్థికాస్తోమత మించి అప్పులు చేసి కోచింగ్ సెంటర్ల వెంటపడే పరిస్థితి పోయి ప్రభుత్వ పాఠశాలల్లో చేరడానికి ముందుకు వస్తారని పేర్కొన్నారు.