నిన్న వీణవంక మండలంలో రైతువేధిక భవనాల ప్రారంభోత్సవం సందర్భంగా సంచలన వాఖ్యలు చేసిన తరువాత రోజే ఈటెల రాజేందర్ కి ప్రగతిభవన్ నుండి పిలుపు రావడం కేసీఆర్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.ఈరోజు అసెంబ్లీ సమావేశాల అనంతరం స్వయంగా కేటీఆర్ తన వాహనంలో ఈటెల రాజేందర్ గారిని ఎక్కించుకుని మరీ తీసుకెళ్లడం ఆసక్తి రేపుతోంది.కేసీఆర్ ,ఈటెల భేటీని కరోన కేసులు పెరుగుతున్న సందర్భంగా జరిగిన భేటీగా టిఆర్ఎస్ శ్రేణులు చెపుతున్న, నిన్నటి వ్యాఖ్యల పర్యవసానమే అని తెలుస్తుంది.గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి జరుపుతున్న కీలక సమావేశాలకు సైతం ఈటెలకు పిలుపు రావట్లేదు,మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తోటి జిల్లా మంత్రిని ఇంచార్జ్ గా నియమించి,సీనియర్ అయిన ఈటెలను విస్మరించడం,నిన్న ఈటెల ఏకంగా పార్టీ సంక్షేమ పథకాల విధాన నిర్ణయాలపై ఘాటు వ్యాఖ్యలు,పార్టీ జెండాను కాదు మనిషిని గుర్తుపెట్టుకోండి అంటూ చేసిన వాఖ్యల నేపథ్యంలో నే ఈ భేటీ అని తెలుస్తోంది.