సురేష్ ప్రొడక్షన్స్,ఎస్ఎల్వీ సినిమాస్ సంయుక్తంగా,రానా దగ్గుబాటి,సాయి పల్లవి,ప్రియమణి ప్రధాన తారాగణంగా వేణు ఉడుగుల దర్శకత్వంలో,సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్న చిత్రం విరటపర్వం టీజర్, మెగాస్టార్ చిరంజీవి చేతులమీదుగా విడుదలైంది.నక్సల్ బరీ నేపథ్యంలో,కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం టీజర్ ‘ఆధిపత్య జాడలనే చెరిపేయగా ఎన్నినాళ్లు,తారతమ్య గోడలను పెకిలించగ ఎన్నిన్నాళ్లు,దున్నేటోడి వెన్నువిరిచి భూస్వాములు ధనికులైరి’ అంటూ సాగే డైలాగ్ తో మొదలై సాయిపల్లవి ప్రేమకు విప్లవాక్షరాల బావుకతతో సాగిన ఈ టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ చిత్రం వేసవి కానుకగా ఏప్రిల్ 30 న థియటర్ లలోకి రాబోతుంది.