రోజురోజుకు దిగజారిపోతున్న ఎన్నికల వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఎన్నికల సంస్కరణలకు శ్రీకారం చుట్టిన కేంద్ర ఎన్నికల సంఘం ఆ దిశగా అడుగులు వేస్తూ తొలుత ‘రిమోట్ ఓటింగ్’ విధానం పై దృష్టి సారించింది.కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి సునీల్ అరోరా మాట్లాడుతు ఎన్నికల వ్యవస్థ లో నూతన ఓటింగ్ విధానం అయిన రిమోట్ ఓటింగ్ విధానం ప్రవేశపెట్టేందుకు సన్నాహకాలు చేస్తున్నామని,రాబోయే 2024 లోక్ సభ ఎన్నికల నాటికి ఈ ఓటింగ్ విధానాన్ని తీసుకువచ్చేలా ప్రయత్నిస్తామని అన్నారు.ఇప్పటికె దేశంలోని వివిధ ఐఐటీలలోని సాంకేతిక నిపుణులు, మద్రాస్ ఐఐటీలో ని సాంకేతిక నిపుణుల సహకారంతో కసరత్తులు ఈసీ ప్రారంభించిందని, రాబోయే ఆరు నెలలలో అన్ని పార్టీలతో మాట్లాడి పైలట్ ప్రాజెక్ట్ ను పరీక్షించి చూస్తామని వెల్లడించారు.
రిమోట్ ఓటింగ్ అంటే ఏంటి?
రిమోట్ ఓటింగ్ అనంగానే ప్రతిఒక్కరి మదిలో మెదిలేది ఆన్లైన్ ఓటింగ్ ఏ,కానీ రిమోట్ ఓటింగ్ అంటే ఆన్లైన్ ఓటింగ్ ఓ,ఇంటినుండి ఓటు హక్కు వినియోగించుకోవడమో కాదని,ఎన్నికల సమయానికి ఓటరు తన ఓటు నమోదైన భూత్ కి దూరంగా వేరే ప్రాంతాల్లో నివసించే వలస కార్మికులు,ఐటీ ప్రొఫెషనల్స్,స్థూడెంట్స్ వంటి వారు తాము ఉండే ప్రాంతాల్లో ప్రభుత్వం ,ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన ఓ పోలింగ్ భూతు లాంటి సెంటర్ కి వెళ్లి తన ఐడెంటిటీ తో తన ఓటు హక్కు వినియోగించుకునే విధానం.గతంలో ఎన్నికల మాజీ డిప్యూటీ అధికారి సందీప్ సక్సేనా పేర్కొన్న ‘బ్లాక్ చైన్ టెక్నాలజీ’ ద్వారా రూపొందించిన టూ వే ఎలక్ట్రానిక్ ఓటింగ్ వ్యవస్థ కలిగి ఉండే విధానంలో రూపొందించిన ఈ సెంటర్ లో ఐపీ పరికరాలు,వెబ్ కెమెరాలు,బయోమెట్రిక్ పరికరాలు వంటివి ఉంటాయని,రిమోట్ ఓటింగ్ విధానంలో ఓటు వేయాలనుకునే వారు ముందుగా వారు నిర్ణయించిన సమయానికి,నిర్దేశించిన తమకు దగ్గరగా వుండే కేంద్రానికి వెళ్లి ఓటు వినియోగించుకోవాల్సి ఉంటుంది.ఈ రిమోట్ ఓటింగ్ తో పాటు ఎన్నారైలు కూడా ఓటుహక్కు వినియోగించుకునేలా ఈ ఓటింగ్ విధానం కోసం ఎన్నికల విధానాల సవరణకు సంబందించిన విషయమై కేంద్ర న్యాయశాఖ మంత్రికి ప్రతిపాదనలు కూడా పంపారు.
Good initiative