కిలో చెక్కెర వందకు చేరింది అనగానే షాక్ అనిపించిందా?? అవును నిజమే మన పక్కనే ఉన్న దాయాది దేశం పాకిస్థాన్ లో కిలో చెక్కెర వంద రూపాయలకు చేరింది.ప్రస్తుతం ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ పాకిస్థాన్ 50 వేల టన్నుల చెక్కెర దిగుమతులకు టెండర్లు పిలువగా,ఈ టెండర్లలో పొరుగు దేశమైన ఇండియాను నిషేదించడంతో ఇది పాక్ లో చెక్కెర పెరుగుదలకు దారి తీసింది. గతంలోనే చెక్కెర దిగుమతులకు టెండర్లను పిలువగా టెండర్లలో ఎక్కువకు బిడ్ అవడంతో టెండర్లను రద్దు చేసింది.పాక్ కు చెక్కెర దిగుమతులు ఇండియా నుండి అయితే తక్కువ దూరం,తక్కువ ట్రన్స్పోర్ట్ ఖర్చుతో నాణ్యమైన,వేగంగా చెక్కెరను టన్నుకు 398 డాలర్లకు సరఫరా చేస్తుండగా,ఇండియా పై నిషేధం విధించడంతో ఇప్పుడు టెండర్లలో కనీస బిడ్ ధర 540 డాలర్లకు చేరింది.ధరల పెరుగుదల దృష్టిలో ఉంచుకొని గత వారమే పాక్ ఎకనామిక్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఇండియా నుండి చెక్కెర,పత్తి దిగుమతులను అనుమతించిన పాక్ క్యాబినెట్ అనుమతించకపోవడంతో చెక్కెర కొరత తీవ్రమై ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.