ఛలో జగిత్యాల ధర్నాకు తరలి రండి
మల్లాపూర్ (జగిత్యాల), మార్చి 30
మల్లాపూర్ మండల రైతులందరూ తేదీ 05 -04- 2021 రోజున జగిత్యాల పాత బస్టాండ్ వద్దకు ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీ పునరుద్ధరణకు ప్రతి ఒక్క రైతు పార్టీలకతీతంగా జగిత్యాల ధర్నా కు ఉదయం 10 గంటలకు రావాలని, చెరుకు రైతు సంఘం అధ్యక్షులు మామిడి నారాయణరెడ్డి, రైతు సంఘం నాయకులు పన్నాల తిరుపతిరెడ్డి, మల్లాపూర్ మండల రైతు సంఘం నాయకులు పూండ్ర శ్రీనివాస్ రెడ్డి మల్లాపూర్ నడిమివాడ సంఘ భవనంలో రైతులందరితో ముఖాముఖి కార్యక్రమం లో కోరారు. ఈ కార్యక్రమంలో బద్దం సోమరెడ్డి, గడ్డం మల్లారెడ్డి, ఎల్లాల శంఖర్ రెడ్డి, గడ్డం శ్రీనివాస్ రెడ్డి, పూండ్ర లక్ష్మారెడ్డి, ఏలేటి రాజరెడ్డి, ఎలాల శ్రీనివాస్ రెడ్డి, ఎల్లాల సోమరెడ్డి, నల్ల జగన్ రెడ్డి, ఎలాల లక్ష్మారెడ్డి, ఏనుగు వెంకట్ రెడ్డి , ఏలేటి లింగారెడ్డి, జోగిన్ పల్లి రాజరెడ్డి, ఏలేటి సోమరెడ్డి, వేంపేట లక్ష్మారెడ్డి,ఎల్లాల తిరుపతిరెడ్డి,పూండ్ర సోమ రెడ్డి, ఏనుగు హనుమాండ్లు తదితరులు పాల్గొన్నారు.