ఆర్మూర్ లోని కుమార్ నారాయణ భవన్ లో రైతు ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంలో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు వి ప్రభాకర్ మాట్లాడుతూ,15వ మార్చిన రాజ్యసభలో ప్రతి పక్షసభ్యుడు అడిగిన ప్రశ్నకు జవాబు చెబుతూ వ్యవసాయ శాఖ మంత్రి తెలంగాణ ప్రాంతంలో పసుపు బోర్డు ఇచ్చే ప్రసక్తే లేదని వ్రాతపూర్వకంగా జవాబు చెప్పారు.
నిన్నటి వరకు పసుపు బోర్డు స్పైస్ బోర్డు ఎంపీ కాకమ్మ కథలు చెప్పి రైతుల మోసం చేస్తూ వచ్చాడు.
2019 రైతు ఉద్యమ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బిజెపి అభ్యర్థిగా అధర్మ వందరూపాయల బాండ్ పేపర్ పై గెలవగానే పసుపు బోర్డు తో పాటు పసుపును ఎం ఎస్ పి లిస్టు చేర్పించే విధంగా చర్యలు తీసుకుంటాను ఒకవేళ సాధ్యం కాకపోతే రాజీనామా చేసి రైతులతో ఉద్యమిస్తామని ప్రతిజ్ఞ పత్రాన్ని విడుదల చేశారు.
కానీ బీజేపీ రంగు రాజ్యసభలో బట్టబయలైంది పసుపు బోర్డు ఇచ్చే సమస్య లేదని తేల్చేసి రాతపూర్వక జవాబు కూడా ఇచ్చారు.
ఈ నేపథ్యంలో అరవింద్ వెంటనే రాజీనామా చేయాలని రైతులతో ఉద్యమించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే గత పాలకుల పట్టిన గతే నీకు పడుతుందని హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు, b దేవరం , మంథని గంగారాం, ఆకుల గంగారాం, g కిసాన్,రాజన్న , k రాజే శ్వార్, స్వామి యాదవ్,సురేష్ , సమీయెల్, తది తరులు పాల్గోన్నారు