ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లాలో మంచుకొండ చరియలు విరిగిపడి దౌలిగంగా నదికి వరద పోటెత్తింది.వరద పెరగడంతో రైనీ తపోవన్ వద్ద ఉన్న పవర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరడంతో అక్కడ పనిచేస్తున్న 150 మంది కార్మికులు గల్లంతు అయ్యారు.గల్లంతైన కార్మికులు,సహాయక చర్యలకోసం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు.దౌలి గంగా నదికి వరదపోటెత్తుతుండటం తో అధికారులు అప్రమత్తం అయి చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలను తరలిస్తున్నారు.దోలిగంగా నదికి వరద ఎక్కువ అవుతుండటంతో దిగువన ఉన్న అలకనందా నదికి కూడా వరద పెరిగే అవకాశం ఉంది.వరదతీవ్రత అధికంగా ఉండటంతో నష్ట ఎంత ఉంటుందో ఇప్పుడే అంచనా వేయలేమని స్థానిక జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.