మాజీ మంత్రి జోగి రమేష్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. పోలీస్ విచారణకు మాజీ మంత్రి జోగి రమేష్ హాజరు కానున్నారు. ఇవాళ సాయంత్రం మంగళగిరి డీఎస్పీ కార్యాలయంలో విచారణకు జోగి రమేష్ హాజరు కానున్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసులో విచారణకు హాజరు కావాలని పోలీసు బృందం నోటీసు ఇచ్చింది. 2022లో దాడి సమయంలో వాడిన మొబైల్ తీసుకురావాలని, స్టేట్ మెంట్ రికార్డ్ చేస్తామని పోలీసులు చెప్పినట్టు సమాచారం అందుతోంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు విచారణకు జోగి రమేష్ వెళ్లనున్నారు.