Telangana: Rangareddy district joint collector trapped by ACB..

Telangana: ACB కి చిక్కిన రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్..

Spread the love

రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ (J.C) భూపాల్రెడ్డి ఏసీబీకి చిక్కారు. ఆయనతో పాటు కలెక్టరేట్ సీనియర్ అసిస్టెంట్ మదన్మోహన్రెడ్డి కూడా పట్టుబడ్డారు. ధరణి పోర్టల్లో నిషేధిత జాబితా నుంచి భూమి తొలగింపునకు జాయింట్ కలెక్టర్ రూ.8 లక్షల లంచం డిమాండ్ చేశారు. డబ్బును సీనియర్ అసిస్టెంట్ ద్వారా J.C తీసుకున్నారు.

 

ఈ క్రమంలో ఏసీబీ అధికారులు దాడి చేసి J.C, సీనియర్ అసిస్టెంట్ను పట్టుకున్నారు. మరోవైపు నాగోల్లోని జేసీ భూపాల్రెడ్డి నివాసంలో ఏసీబీ అధికారుల సోదాలు చేపట్టారు. ఇంటిలో రూ.16లక్షల నగదు, కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *