హైదరాబాద్ మహా నగరంలో కానిస్టేబుళ్లు అరాచకాలకు పాల్పడ్డారు. మధురానగర్ పీఎస్ కు చెందిన ముగ్గురు కానిస్టేబుళ్లు సస్పెండ్ అయ్యారు. దామోదర్, నాగరాజు, సతీష్ లను హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేశారు. హోం గార్డ్ రాజును పోలీసు శాఖకు చెందిన మోటారు ట్రాన్స్ పోర్ట్ కు వెనక్కి పంపి హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి చర్యలు తీసుకున్నారు.
స్పా సెంటర్స్ , వ్యభిచార గృహాల నుండి నెలవారీ మామూళ్లు వసూలు చేశారట కానిస్టేబుళ్లు దామోదర్, నాగరాజు, సతీష్. లంచాలతో పాటు అక్కడి యువతులతో ఖాకీల రాసలీలల్లో పాల్గొన్నారట. స్పా సెంటర్ లోకి ముగ్గురు కానిసేబుళ్లు, హోం గార్డ్ వెళ్లొచ్చిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికా ర్డ్ అయ్యాయి. ఇక ఆ ఆరోపణలన్నీ వాస్తవమేనని తేలడంతో ముగ్గురు కానిస్టేబుళ్ళపై హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సస్పెన్షన్ వేటు వేశారు.