టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కృష్ణంరాజు వారసత్వాన్ని అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీని హీరో ప్రభాస్ ఏలుతున్నాడు. అయితే తాజాగా ప్రభాస్ చేసిన సినిమా కల్కి 2898 AD. సైంటిఫిక్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. దాదాపు 1200 కోట్ల కలెక్షన్లను కల్కి సినిమా రాబట్టగలిగింది. వైజయంతి మూవీ మేకర్స్ తెరకెక్కించారు.
ఇక ఈ సినిమాకు నాగశ్విన్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ సినిమాలో హీరోగా ప్రభాస్ చేయగా దిశాపటాని, దీపికా లాంటి స్టార్లు ఉన్నారు. అటు విజయ్ దేవరకొండ, కమల్ హాసన్ లాంటి కీలక నటులు కూడా ఉన్నారు. అయితే ఈ సినిమా నుంచి తాజాగా క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా OTT రైట్స్ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుందని… సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అంతేకాదు, ఆగస్టు 23వ తేదీన ఈ సినిమా.. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతుందని కూడా తెలుస్తోంది.