AP Politics: Unemployed Vedic students get Rs. 3 thousand gratuity..!

AP Politics: నిరుద్యోగ వేద విద్యార్ధులకు నెలకు రూ. 3 వేలు భృతి..!

Spread the love

ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. నిరుద్యోగ వేద విద్యార్ధులకు నెలకు రూ. 3 వేలు భృతి ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు.రూ. 10 వేలు వేతనం వచ్చే అర్చకులకు ఇకపై రూ. 15 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ధూపదీప నైవేద్యాలకు ఇచ్చే మొత్తం రూ. 5 వేల నుంచి రూ. 10 వేలకు పెంచుతున్నట్లు వెల్లడించారు.

 

నాయీ బ్రాహ్మణులకు కనీసం వేతనం రూ. 25 వేలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తాజాగా దేవాదాయ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా దేవదాయ శాఖపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సీజీఎఫ్ కింద, శ్రీవాణి ట్రస్ట్ నిధుల ద్వారా జరిగే పనుల్లో ప్రారంభం కాని పనులు నిలిపివేయాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.

 

దేవాలయ ఆస్తుల పరిరక్షణకు కమిటీల ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పరిశుభ్రత, ప్రసాదంలో నాణ్యత, ప్రశాంత వాతావరణం కనిపించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సింహాచలం పంచగ్రామాల సమస్యకు శాశ్విత పరిష్కారం కోసం ఏపీ సీఎం చంద్రబాబు చర్యలు తీసుకుంటామన్నారు. ఎండో, ఫారెస్ట్, టూరిజం మంత్రులతో రిలీజియస్ టూరిజం ప్రమోషన్ కోసం కమిటీ వేస్తున్నామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *