టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ శనివారం క్రికెట్ కు రిటైర్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్ తో పాటు దేశవాళి క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. జీవితంలో తర్వాతి పేజీకి వెళ్లాల్సిన సమయం వచ్చిందని, అందుకే రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు చెప్పాడు. అయితే రిటైర్మెంట్ ప్రకటించిన రెండు రోజులకే దావన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ లో పాల్గొంటున్నట్లు 38 ఏళ్ల ఈ ఎడమ చేతి వాటం బ్యాటర్ ప్రకటించారు.
తన నుంచి ఆట విడదీయలేని భాగం అని, తన శరీరం ఇంకా ఆటకు సహకరిస్తుందని తెలిపారు. మైదానంలో తన స్నేహితులను తిరిగి కలుసుకుంటున్నానని, అభిమానులకు కొత్త జ్ఞాపకాలు అందించడానికి సిద్ధంగా ఉన్నానని ధావన్ పేర్కొన్నారు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలి సీజన్లో ఇండియా క్యాపిటల్స్ విజేతగా నిలిచింది. ఇక గత 2023 సీజన్ లో మణిపాల్ టైగర్స్ ఛాంపియన్ గా నిలిచింది. ఈ లీగ్ లో మొత్తం ఆరు జట్లు పాల్గొన్నాయి. అయితే గత సీజన్ లో గౌతమ్ గంభీర్-శ్రీశాంత్ మధ్య జరిగిన వాగ్వాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.