ఒక సిరీస్ ఇంకొక సిరీస్ మధ్య ఎక్కువ సమయం ఉంటే ఫిట్నెస్, ఫామ్ కోసం క్రికెటర్లు దేశవాళీలో ఆడుతుంటారు. అందులో పాల్గొనకుండా కొందరు స్టార్లకు మాత్రమే కాస్త వెసులుబాటు దక్కేది. కానీ, ప్రధాన కోచ్గా గౌతమ్ గంభీర్ వచ్చాక ప్రతిఒక్కరూ డొమిస్టిక్ క్రికెట్ ఆడాలనే రూల్ పెట్టినట్లున్నాడు. శ్రీలంక టూర్ నుంచి టీమ్ఇండియాకు మరో 40 డేస్ వరకు ఎలాంటి సిరీస్లు లేవు. బంగ్లాదేశ్తో సెప్టెంబర్ 19 నుంచి టెస్టు సిరీస్ మొదలుకానుంది. ఆలోగా దేశవాళీ
క్రికెట్ ఆడాలని భారత క్రికెటర్లకు బీసీసీఐ నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. సీనియర్లు ఆటగాళ్ళైనా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా ఆడతారనే న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. దీంతో సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీలో ఆడటం వల్ల బంగ్లాతో టెస్టు సిరీస్కు సన్నద్ధమయ్యేందుకు ఛాన్స్ ఉంటుందనేది బీసీసీఐ భావిస్తుంది.
రోహిత్, విరాట్ మాత్రమే కాకుండా.. రవీంద్ర జడేజా, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, సంజూశాంసన్ సహా ఇతర క్రికెటర్లు దేశవాళీలో ఆడనున్నారు. అయితే, ఈ జాబితా నుంచి కేవలం ఒక్క క్రికెటర్కు మాత్రమే మినహాయింపు ఇచ్చినట్లు సమాచారం. అతడే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా. పని ఒత్తిడి మేనేజ్మెంట్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నవంబర్ నుంచి ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ ఉన్న నేపథ్యంలో బుమ్రా విషయంలో బీసీసీఐ రిస్క్ తీసుకోదల్చుకోలేదని సమాచారం. బంగ్లాను ఎదుర్కోవడంపై పెద్దకష్టం కాదని.. ఆసీస్తోనే టెస్టు సిరీస్ కీలమనే భావనలో మేనేజ్మెంట్ ఉంది. ఇక గాయం నుంచి కోలుకున్న పేసర్ మహమ్మద్ షమీ ఇప్పటికే దేశవాళీలో ఆడతానని వెల్లడించాడు. సెంట్రల్ కాంట్రాక్ట్కు దూరమైన ఇషాన్ కిషన్ కూడా రెడీగా ఉన్నాడు. సీనియర్ క్రికెటర్లు అజింక్య రహానె, ఛెతేశ్వర్ పుజారా దేశవాళీలో ఆడినా.. జాతీయజట్టులో అవకాశం ఇవ్వడం కష్టమే అనిపిస్తుంది.