ప్రముఖ నటుడు, టాలీవుడ్లో విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భిక్షు యాదవ్ (ప్రదీప్ రావత్) ఇకలేరు. 74 ఏళ్ల వయసులో చాలా సినిమాలు చేసారు. మంగళవారం సాయంత్రం ఆయన గుండెపోటు రావడంతో హాస్పిటల్ ల్లో చేర్పించారు. చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. ఈ వార్తతో బాలీవుడ్లోనే కాదు టాలీవుడ్ fఇల్మ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయనతో వర్క్ చేసిన సహనటులు, దర్శకులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.
తెలుగు ప్రేక్షకులకు ప్రదీప్ రావత్ సై సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో ఆయన భిక్షు యాదవ్ పాత్రల్లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చిత్రానికి ఆయన ఉత్తమ ప్రతినాయకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు, నంది అవార్డులతో సహా పలు పురస్కారాలు అందుకున్నారు.
ఆ తర్వాత ఛత్రపతి నుంచి లాస్ట్ ఇయర్ వచ్చిన వాల్తేరు వీరయ్య వరకు చాలా తెలుగు సినిమాల్లో విలన్‌గా, కీలక పాత్రల్లో నటించి తనదైన ముద్ర వేశారు. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో 100కు పైగా సినిమాల్లో ప్రదీప్ రావత్ నటించారు. అయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
