తమిళ అగ్ర కథానాయకుడు సూర్య నటించిన తాజా సినిమా “కంగువా” ‘కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు శివ ఈ సినిమాన్ని తెరకెక్కిస్తుండగా సరికొత్త కథతో ఈ మూవీ ప్రేక్షకులను థ్రిల్ చేయనుంది. ఈ మూవీ నుంచి మేకర్స్ తాజాగా ట్రైలర్ ని విడుదల చేశారు. చాలా పవర్ పుల్ గా ఈ ట్రైలర్ ను కట్ చేశారు మూవీ మేకర్స్. ఒక తెగకు సంబంధించిన నాయకుడిగా బాబీ డియోల్, మిగతా తెగలను శాసించాలనే ఉద్దేశంతో వారిపై దాడి చేస్తుంటాడు.
బాబీ డియోల్ లుక్ ను మూవీ మేకర్స్ పవర్ పుల్ గా ప్రెజెంట్ చేశారు. హీరో సూర్య కూడా ఓ తెగకు చెందిన నాయకుడిగా, తన తెగను కాపాడుకునేందుకు చేసే యుద్ధాన్ని మనకు ఈ సినిమాలో చూపెట్టబోతున్నారు. సూర్య లుక్స్ కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉండటం, దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతం కలగలిసి ‘కంగువా’ మూవీపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ భామ దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ అడ్వెంచరస్ మూవీ అక్టోబర్ 10న గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సిద్దమైంది.